Valmiki Ramayanam

Author:   Pamireddy Damodarareddy ,  Padmaja Pamireddy
Publisher:   Kasturi Vijayam -Sud
ISBN:  

9788196087685


Pages:   146
Publication Date:   31 January 2023
Format:   Paperback
Availability:   Available To Order   Availability explained
We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately.

Our Price $50.13 Quantity:  
Add to Cart

Share |

Valmiki Ramayanam


Add your own review!

Overview

వాల్మీకి రామాయణం - చారిత్రక దృక్కోణం అనే అంశంపై పరిశోధన చేయడానికి 2004 వ సంవత్సరం లోనే బీజం పడింది. చరిత్ర - చారిత్రక రచనల పట్ల నాకున్న ఆసక్తి తో రెండు చారిత్రక రచనలు చేశాను. ఈ పరంపర తోనే రామాయణంపై దృష్టి పెట్టాను. రాళ్ళపై రాతలు కన్పించవు కాని శిలలపై రామకథా శిల్పాలు అనేకం కన్పిస్తాయి. తవ్వకాలలో రామాయణం కాలం నాటి మట్టి పాత్రలు లభించలేదు కాని ప్రతి భారతీయుని గుండెలు తవ్వితే రాముడే కన్పిస్తాడు. అక్కడక్కడ రాజులు వేయించిన రామటెంకెలు (నాణ్యాలు) రామచరిత్రకు ఆధారాలుగా నిలవక పోయినా, భారతీయ సమాజంలో అనాదిగా రామకథా సంబంధిత నామాలు (పేర్లు) అంతటా కన్పిస్తాయి.ఈ కోణంలోనే రాముడి చారిత్రకతను నిరూపించే ప్రయత్నం చేశాను. ఎన్నో అంశాలు నేటికీ చిక్కు వీడని ప్రశ్న. పురావస్తు శాఖ నిరూపించనూలేదు. పాశ్చాత్య దృక్పథంతో రాయబడ్డ భారత చరిత్రను విస్మరించి స్వచ్ఛమైన భారతీయ చారిత్రక తత్వాన్ని నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక వేళ రామాయణం జరిగి ఉన్నా, అది అంతా ప్రాచీనమైంది కాదు. అది లోహయుగం తరువాత జరిగింది. ఇందులో లోహపు ఆయుధాలు, పార లాంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి ఇనుప యుగం తరువాతే జరిగింది. బంగారు, వెండి గురించి తెలిసిన సింధు నాగరికత ప్రజలకు ఇనుము గురించి తెలియదని వాదించే వాళ్లు ఉన్నారు.ఇక్కడ మతాల గురించి, మతశక్తుల గురించి చర్చించడం లేదు. భారతీయ ప్రాచీనతను ప్రజలకు పరిచయం చేయడం ద్వారా భారతీయ జాతి మానసిక బలాన్ని, విశ్వాసాన్ని పొందగలుగుతుంది. రామాయణ విశిష్టతో పాటు రాజకీయ, సామాజిక, భౌగోళిక అంశాల్ని పాఠకుల ముందుకు తేవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ పడిన అందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.- డాక్టర్. పామిరెడ్డి దామోదరరెడ్డి

Full Product Details

Author:   Pamireddy Damodarareddy ,  Padmaja Pamireddy
Publisher:   Kasturi Vijayam -Sud
Imprint:   Kasturi Vijayam -Sud
Dimensions:   Width: 15.20cm , Height: 0.90cm , Length: 22.90cm
Weight:   0.186kg
ISBN:  

9788196087685


ISBN 10:   8196087683
Pages:   146
Publication Date:   31 January 2023
Audience:   General/trade ,  General
Format:   Paperback
Publisher's Status:   Active
Availability:   Available To Order   Availability explained
We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately.
Language:   Telugu

Table of Contents

Reviews

. . . . . . ? ? . . . . , , . . . , . . . . . . . . . . . , . . . . . . . , . ., .


రామాయణం అనేది ఓ సంస్కృతి. భారతీయులకు ఆరాధ్యగ్రంథం. వివిధ భాషలలో రాముని కథ ఆవిష్కృతమైంది. వివిధ ప్రాంతాల్లో రామాలయాలు వెలిశాయి. అంతే సంఖ్యలో ఆంజనేయునికి ఆలయాలు కట్టారు. ఈ గుళ్లు లేని ఊరు ఉండదు. ఇంతటి ప్రసిద్ధి పొందిన కావ్యం జరిగిన కథనా? లేక కల్పనా? అనేది అందర్ని ఆలోచింపచేసే అంశం. ఏ దేశంలోనూ కథలలో ఉండే పాత్రల్ని దేవుడిగా పూజించరు. ప్రాచీన కావ్యాలు చాలా ఉన్నాయి. అందులోని నాయకులను ఎందుకు గుర్తించడం లేదు. అవి కథలు, కేవలం విజ్ఞానం, వినోదం కోసం చదువుతున్నాం. రామాయణం అందుకు భిన్నమైంది. ఇందులోని కథ ఎప్పుడో ఒకప్పుడు జరిగింది. రాముడు దైవిక శక్తి, ఆదర్శ గుణాలతో ఉత్తమ వంశంలో జన్మించాడు. నీతినియమాలతో సమాజాన్ని నడిపించాడు. రామాయణం ఇతిహాసం అని పిలవడంలోనే చరిత్ర వుంది. ఇది కల్పన అని అనుమానించడం భారతజాతిని అవమానించడమే. ప్రాచీన భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటేనే రామాయణ స్వరూపం అర్థం అవుతుంది. బలవంతులైన రావణుడిని రాముడు చంపడం ఆనాటి సమాజంలో ప్రకంపనాలు రేపి ఉంటుంది. ఆ ప్రకంపనాలు నేటి సమాజం వరకు వ్యాప్తి చెందుతునే ఉన్నాయి. అందుకే రాజైన రాముడు దేవుడైనాడు. రాజును నా విష్ణు పృధ్వీపతి అని భావించారు. రాముడు రావణ వధార్థమై అవతరించిన విష్ణువు. ఆర్యదేవుడైన ఇంద్రుని విష్ణువు స్థానంలోకి నిలిపే ప్రయత్నం కన్పిస్తుంది. ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం కల్గుతుంది. ధర్మం వల్ల సకలం చేకూరుతుంది. ఈ ప్రపంచంలో ధర్మమే సారం అని రాముడితో సీత అనడంలో ధర్మస్థాపనకు ఆ ఆదర్శ దంపతులు కట్టుబడి ఉన్న వైనం స్పష్టమవుతుంది.ఇలాంటి సూక్ష్మాతి సూక్ష్మములైన అంశాలను పరిశీలించి మా మిత్రుడు డా. పామిరెడ్డి దామోదరరెడ్డి ఈగ్రంథ రచన చేశారు. డా. కె. రాములు గౌడ్, ఎం.ఏ., పిహెచ్. డి


Author Information

Tab Content 6

Author Website:  

Customer Reviews

Recent Reviews

No review item found!

Add your own review!

Countries Available

All regions
Latest Reading Guide

MRG2025CC

 

Shopping Cart
Your cart is empty
Shopping cart
Mailing List