|
![]() |
|||
|
||||
Overviewజగత్ సృష్టికర్త అయిన శివ పరమాత్ముడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను మరియు జీవాను జీవములను సృష్టించినవాడై యుండెను. ఈ జగత్ వ్యవహారములకు కారణ భూతుడయిన శివపరమాత్ముడు జ్యోతిస్వరూపుడై యున్నాడు. సృష్టి యొక్క ఆదిమధ్యాంతముల జ్ఞానమును తెలిసిన వాడును అట్లే అవినాశియు అయివున్నాడు. భయంకర దుఃఖ దుర్మనాదుల స్మరణ మాత్రము చేత. నివారించ తెలిసినవాడై యున్నాడు. సత్యజ్ఞాన అనంత రూపియై యున్నాడు. నిరాకార నిర్గుణ నిష్ఠపంచక అవినాశి నిత్య సంతోషదాయక విశ్వకళ్యాణకారక పరమ పవిత్ర పతితపావన సర్వాంతర్యామి సర్వజ్ఞ స్వరూపుడై లయ ఉత్పత్తులకులోను కాక ఉన్నట్టి శివపరమాత్ముని విశ్వమందలి జనత, వివిధ నామములతో పిలుచుచూ పూజించుచున్నారు. ఇట్టి పరమ శివుణ్ణి వీరశైవులు లింగ స్వరూపముచేత సదా దేహాంగము మీద ధరించి పూజించినట్లు యితరులు వివిధ స్వరూపముల పూజించుట కానవచ్చుచున్నది.ఇట్టి పరమశివుని వర్ణనను శివదృష్టి అను గ్రంథము చేత జనులకు తెలుగు భాషయందు శ్రీమాన్ విద్వాన్ చొప్ప వీరభద్రప్ప గారు రచించి ప్రకాశమొనరించుట స్తుతింపదగినదై యున్నది. అయినంత తొందరలో ఈ గ్రంథము ప్రకాశ రూపము ధరించి జనులకు అతి త్వరలో లభించునట్లు కావలయునని ఆశించడమయినది.ఇత్యాశిషః శ్రీ జగద్గురు శ్రీశైల సూర్యసింహాసనమఠ్ అధికార స్థానం, శ్రీశైలం. Full Product DetailsAuthor: Vidwan Choppa VeerabhadrappaPublisher: Kasturi Vijayam Imprint: Kasturi Vijayam Dimensions: Width: 15.20cm , Height: 0.60cm , Length: 22.90cm Weight: 0.132kg ISBN: 9788196229146ISBN 10: 8196229143 Pages: 98 Publication Date: 05 March 2023 Audience: General/trade , General Format: Paperback Publisher's Status: Active Availability: Available To Order ![]() We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately. Table of ContentsReviews"శ్రీ చొప్ప వీరభద్రప్ప గారి శివదృష్టి అత్యంత సుందరం. వీరి ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ ప్రాశస్త్యం పాఠకులకు అమృతపానం. శివభక్తులకు, జిజ్ఞాసువులకు వీరి రచన భాగవతదృష్టి నను గ్రహిస్తున్నది. ఎందరో మహానుభావులు, తమ అనుభవంతో చెప్పిన ఈశ్వర తత్వాన్ని సంగ్రహించి, 'శివదృష్టి' అనే రచన ద్వారా భగవద్భక్తులకు అర్థమయ్యేట్లు ఈ రచయిత అందించారు.శ్రీ వీరభద్రప్పగారు తమ ""శివదృష్టి"" రచనలోని ""నమఃశివాయ"" మంత్రము వివిదార్ధములు, పంచాక్షరి వివిధనామములు, పంచాక్షరి మహాత్మ్యం, శివలింగైక్యం అనే అంశాలు భక్తులకు అమృతపు గుళికలు. ఈ సందర్భంగా వీరు భక్తుని పరిస్థితిని వివరిస్తూ భక్తుడు తనను తాను మరచి భగవంతునిలో లీనమగుట లయమని వివరించారు. ఇది పరవశస్థితి. ""లయస్థితి భక్తికి పరాకాష్ట"". జీవాత్మ శుద్ధమై, పరిపూర్ణమై ఆత్మసంవేదనము చేసికొనే నిర్వికల్ప సమాధిస్థితి. దీనిని మించిన స్థితి జీవాత్మ పొందలేదు. ఈ స్థితిలో భక్తుడు లేడు. భక్తిలేదు. పూజలేదు. పూజించేవాడులేడు. ఇది అఖండ ఆనంద రూప పరబ్రహ్మైక స్థితి.... వెలుగులో వెలుగు కలసి పోయినట్లుండే పూర్ణ స్థితి ఇది. శరీరంలో శరీరం, జీవంలో జీవం, ప్రాణంలో - ప్రాణం, ఇంద్రియాలలో ఇంద్రియాలు, రూపంలో రూపం, శబ్దంలో శబ్దం లీనమగు స్థితి. పూర్ణ జ్యోతి మింగిన కర్పూర స్థితి. ఇది నిస్సంశయ వాగతీత, భావాతీత, పూర్ణలింగైక్య లయస్థితి. ఇదే ఐక్యస్థితి అని మధురాక్షరాలైన మాటలు ముముక్షువులకందించారు. వీరి అమృత లేఖిని నుండి వెల్వడిన అజరామరాలైన ఆనంద పరబ్రహ్మ సౌందర్యాన్ని పాఠకులైన భక్తులు దర్శించి భాగవత మార్గంలో పయనిస్తూ పునీతులౌతారని ఆశిస్తున్నాను.డా. జి. ఆంజనేయులు, కళ్యాణదుర్గం" Author InformationTab Content 6Author Website:Countries AvailableAll regions |