|
|
|||
|
||||
Overviewన్యాయ శాస్త్రవేత్త సాల్మండ్ చెప్పినట్లు సమాజ అభివృద్ధికి చట్టాలు ఎంతో ఉపయోగపడతాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో నలుగురిలో ఒక్కరైనా ఉన్నత విద్యావంతులై ఉంటారు. వారిలో సామాజిక చైతన్యం ఉండడమే కాకుండా చట్ట పరమైన పరిజ్ఞానం కూడా ఎంతో కొంత ఉంటుంది. వాళ్ళు డాక్టర్లయినా, ఇంజనీర్లయినా, వ్యాపారస్తులయినా న్యాయపరమైన అంశాలనెన్నింటినో అవగాహన చేసుకోవడమే కాకుండా వారి, వారి వృత్తులను చట్టబద్ధం(లీగల్) గా నిర్వర్తించు కోవడం జరుగుతుంది. మానవ జీవితంలో అనేక సమస్యలుంటాయి. ఆ సమస్యల్లో న్యాయ సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు ఎవరైనా గాని ఎంతో కొంత సంఘర్షణకు గురికాక తప్పదు. భారతదేశం వ్యవసాయిక దేశం కావడం వల్ల ప్రజలు చదువు విషయంలో వెనుకబడి, చట్టపరమైన పరిజ్ఞానం కొరవడి జీవిస్తున్నారు. చట్ట పరిజ్ఞానం లేనందున ఎవరూ క్షమార్హులు కారు. నేరం తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత చట్టం, న్యాయం సంబంధిత అంశాల పైన పట్టు సంపాదించాలి. అందుకోసం ప్రజలు చట్టాలను చదవాలి, శాసనాలను తెలుసుకోవాలి. ప్రజలు చట్టాలను, శాసనాలను అవగాహన చేసుకున్నప్పుడే వారి మధ్య గొడవలకు, వివాదాలకు, వాదనలకు చోటుండదు. అప్పుడే ప్రజలు నేరాలు, ఘోరాలు చేయకుండా, కోర్టుల్లో వ్యాజ్యాలు వేయకుండా చట్ట పరిధిలో శాంతియుతంగా కలిసి ఉంటూ ప్రశాంతంగా జీవిస్తారు. ఇది ప్రత్యక్షంగా, ప్రజలకు పరోక్షంగా సమాజానికి లాభం చేకూర్చుతుంది. ఈ పుస్తకం సామాన్య ప్రజలకు, న్యాయశాస్త్ర విద్యార్థులకు, యువ న్యాయవాదులకు, బ్యాంకర్స్ కు, చర, స్థిరాస్థులు ఉన్నవారికి, రైతులకు, మహిళలకు ప్రతి ఒక్కరికి ఎంతో కొంతైన ఉపయోగపడవచ్చుజి. గంగాధర్,అడ్వకేట్ ggangadhar1516@gmail.com Full Product DetailsAuthor: G GangadharPublisher: Kasturi Vijayam Imprint: Kasturi Vijayam Dimensions: Width: 15.20cm , Height: 0.80cm , Length: 22.90cm Weight: 0.163kg ISBN: 9788196266769ISBN 10: 8196266766 Pages: 126 Publication Date: 28 April 2023 Audience: General/trade , General Format: Paperback Publisher's Status: Active Availability: Available To Order We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately. Language: Telugu Table of ContentsReviewsచట్టానికి కళ్ళు లేక పోవచ్చు కాని దానిని పాటించే వారు మాత్రం కళ్ళు తెరుచుకొని నడవాల్సిందే. తాగి వాహనం నడపకూడదని, నలుగురిలో ధూమపానం చేయకూడదని తెలియదంటే చట్టం ఊర్కొదు. అది నీ తెలివి తక్కువ తనమని భావించి చెవులు పిండి శిక్ష వేస్తుంది. ఏ దేశ చట్టాలైనా ఆయా దేశ పౌరుల నడవడి కోసం, సాంఘిక జీవన విధానానికి, దేశంలోని సాంప్రదాయకత, సామరస్యాన్ని కాపాడేందుకు రూపొందుతాయి. వాటిని తెలుసుకోవడం పౌర ధర్మం. అయితే వీటి గురించి సరైన అవగాహన కల్పించే వ్యవస్థలు మాత్రం మన దేశంలో అంతగా ఏర్పడలేదు. మన సామాజిక, కుటుంబ పర జీవితంలో చట్టానికి ఉన్న ప్రాధాన్యత, అవశ్యకతలను చెప్పే రచనలు, వేదికలు కూడా అరుదే. దానివల్ల చట్టంలో ఏముందో తెలియక స్వంత నిర్ణయాలతో, తప్పుడు అవగాహనతో తోచినట్లు చేసుకుపోతుంటాం. దానివల్ల కలిగే లాభం లేకపోగా నష్టమే ఎక్కువ. చట్టం తెలియడం వల్ల వ్యక్తిగత బాధ్యతలపై అవగాహన రావడంతో పాటు సాటి మనిషి హక్కులకు భంగం కలుగకుండా కూడా వ్యవహరించడం జరుగుతుంది. తద్వారా అనవసరపు తగాదాలు తగ్గి సమాజంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇంకా చట్టపరంగా వివరించవలసిన విషయాలు ఏమైనా మిగిలి ఉంటే వాటిపై కూడా వ్యాసాలు రాసి అందించే కృషి చేయాలని రచయితకు విజ్ఞప్తి చేస్తూ సెలవు. --బి. నర్సన్ Author InformationTab Content 6Author Website:Countries AvailableAll regions |
||||